సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ బాధితులకు అండగా ఎంపీ డీకే అరుణ.

Advertisements

<p>మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ డీకే అరుణ&period; కేంద్ర పర్యావరణ&comma; అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఢిల్లీలో కలిసి&comma; సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు&period; తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 641 ద్వారా సిద్ధాపూర్ గ్రామంలోని 86 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసి&comma; అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిందని ఎంపీ డీకే అరుణ కేంద్ర మంత్రికి వివరించారు&period; అయితే&comma; ఇదే ప్రాంతాన్ని గతంలో ఈకో టౌన్ ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించారని గుర్తు చేశారు&period; జీవో-111 పరిధిలోని దాదాపు 50 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ప్రభావం పడే అవకాశం ఉందని&comma; ఉస్మాన్ సాగర్&comma; హిమాయత్ సాగర్ తాగునీటి వనరులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు&period; డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యం&comma; జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.