తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.

Advertisements

<p>మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది&period; బడ్జెట్&comma; మిడ్-రేంజ్&comma; ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది&period; దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ&comma; సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది&period; ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది&period; ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో చివరిసారిగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలను సవరించారు&period; నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ధరలను సమీక్షించాల్సి ఉన్నప్పటికీ&comma; గత మూడేళ్లుగా పెంపుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించాయి&period; ముడిసరుకుల ధరలు&comma; రవాణా ఛార్జీలు&comma; సిబ్బంది జీతాలు&comma; పన్నుల భారం గణనీయంగా పెరిగిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ నేపథ్యంలో ప్రభుత్వం &&num;8216&semi;à°§à°°à°² నిర్ణయ కమిటీ&&num;8217&semi;ని ఏర్పాటు చేసి&comma; డిస్టిలరీల ప్రతినిధులతో చర్చలు జరిపింది&period; పెరిగిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని కమిటీ ఈ నివేదికను రూపొందించింది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని డిస్టిలరీలు డిమాండ్ చేస్తున్నాయి&period; అయితే&comma; à°§à°°à°² పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది&period; మద్యం ధరలను భారీగా పెంచితే&comma; పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్&comma; కర్ణాటకల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది&period; దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది&period; అందుకే&comma; పొరుగు రాష్ట్రాల్లోని ధరలతో పోల్చి చూసిన తర్వాతే పెంపుదల శాతాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది&period; సబ్-కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి&comma; త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.