క్విట్ ఇండియా స్ఫూర్తితో ఇసుక లారీ యజమానుల ‘జైల్ భరో’.

Advertisements

<p>క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో ఇసుక లారీ యజమానులు&comma; కార్మికులు నిరసన బాట పట్టారు&period; రైతు&comma; కార్మిక సంఘాలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో &OpenCurlyQuote;జైల్ భరో’&comma; నిరసన కార్యక్రమం నిర్వహించారు&period; రాష్ట్ర ఇసుక లారీల సంఘం అధ్యక్షుడు సుర్వీ యాదయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు&comma; లారీ యజమానులు&comma; కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలోని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు&period; ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు&period; నాణ్యత లేని ఫిల్టర్ ఇసుక వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు&period; ఇసుక రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు&period; ఇసుక రీచ్‌లలో అక్రమంగా వసూలు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు&period; తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్