తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ.

Advertisements

<p>తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగిసింది&period; బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే ప్రక్రియ నేటితో పూర్తి కాగా&comma; సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు కసరత్తు వేగవంతం చేశారు&period; రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఇప్పటివరకు 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాలేదు&period; రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 3&period;38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయగా&comma; అధికారులు ఇప్పటివరకు 2&period;64 కోట్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను మాత్రమే పూర్తి చేయగలిగారు&period; రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఓటర్లు ఇప్పటివరకు తమ వివరాలు లేదా ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులకు సమర్పించలేదు&period; ఇల్లు మారడం &comma; ఊరిలో అందుబాటులో లేకపోవడం &comma; మరణించడం లేదా నకిలీ ఓట్లు ఉండటం వల్ల ఈ స్థాయిలో ఫారాలు ఇంకా స్వీకరించలేదని తెలుస్తోంది&period; రాజధాని హైదరాబాద్‌లో ఈ ప్రక్రియ మరీ మందకొడిగా సాగుతోంది&period; హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటివరకు 60 శాతం కూడా దాటకపోవడం గమనార్హం&period; మేడ్చల్-మల్కాజిగిరి&comma; రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే తరహాలో మందగమనం కనిపించింది&period; డిజిటలైజేషన్ పూర్తయిన అనంతరం ఈ నెలలోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడానికీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్