తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక కదలిక.

Advertisements

<p>తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది&period; తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించేందుకు వార్ధా–వెయిన్‌గంగ నదులు కలిసే ప్రాంతమే అత్యంత అనువైన ప్రదేశమని సమగ్ర ప్రాజెక్టు నివేదిక స్పష్టం చేసింది&period; బ్యారేజీ నిర్మాణానికి నాలుగు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అధికారులు&period;&period; చివరకు ఈ ప్రాంతాన్నే సిఫార్సు చేశారు&period;<&sol;p>&NewLine;<p>150 మీటర్ల పూర్తి స్థాయి నీటిమట్టంతో&period;&period; 6&period;517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు&period; ఈ ప్రాంతంలో బ్యారేజీ నిర్మిస్తే గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని&period;&period; వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ముంపు ఉండదని నివేదిక పేర్కొంది&period; అంతేకాదు మొత్తం ముంపులో 68 శాతం నదీ గర్భంలోనే ఉంటుందని తెలిపింది&period; గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని&period;&period; దీంతో పునరావాస సమస్య కూడా ఉండదని డీపీఆర్‌లో స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించి&period;&period; సుందిళ్ల బ్యారేజీకి తరలించి&period;&period; అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలని ప్రణాళిక రూపొందించారు&period; మొత్తం 80 టీఎంసీల నీటిని 90 రోజుల్లో మళ్లించేలా పథకాన్ని డిజైన్ చేశారు&period; ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5&period;85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందని డీపీఆర్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>ఈ పథకం నిర్మాణ వ్యయాన్ని రూ&period;12&comma;085 కోట్లుగా అంచనా వేశారు&period; 2025-26 à°§à°°à°² ఆధారంగా ఈ అంచనాలను రూపొందించారు&period; తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు ఇప్పటికే చేపట్టిన కాలువ పనులను పొడిగించడంతో పాటు&period;&period; టన్నెల్‌&comma; గ్రావిటీ కాలువ నిర్మాణాలను కూడా ప్రతిపాదించారు&period;<&sol;p>&NewLine;<p>ఇక బ్యారేజీ డిజైన్‌లో భాగంగా భారీ వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు&period; వార్ధా నదిపై 60 గేట్లు&period;&period; వెయిన్‌గంగపై 77 గేట్లతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు&period; ముంపులో 80 శాతం మహారాష్ట్ర పరిధిలో&period;&period; 20 శాతం తెలంగాణలో ఉంటుందని నివేదిక వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p>గతంలో ప్రాణహిత–చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి&period; అయితే బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు&period; ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే విధానాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది&period; అయితే తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో&period;&period; ఇప్పుడు ఆ దిశగా డీపీఆర్‌ సిద్ధమైంది&period; ఈ డీపీఆర్‌ను నీటిపారుదల శాఖకు కన్సల్టెన్సీ సంస్థ అందజేయగా&period;&period; ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం&period; డీపీఆర్‌ సిఫార్సుల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు భవిష్యత్‌ కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్