జైల్లోనే చదువు.. 78 మంది ఖైదీల విజయం.

Advertisements

<p>తెలంగాణ జైళ్ల చరిత్రలో ఓ కీలక ముందడుగు పడింది&period; జైల్లో ఉంటూనే చదువును కొనసాగించిన 78 మంది ఖైదీలు NIOS ద్వారా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు&period; చర్లపల్లి సెంట్రల్ ప్రిజన్&comma; నిజామాబాద్ సెంట్రల్ ప్రిజన్&comma; హైదరాబాద్ మహిళా ప్రత్యేక జైలుకు చెందిన మొత్తం 108 మంది ఖైదీలు SSC కోసం నమోదు చేసుకోగా&period;&period; వారిలో 78 మంది విజయవంతంగా పరీక్షలు పాసయ్యారు&period; చర్లపల్లిలో 56 మంది&comma; నిజామాబాద్‌లో 15 మంది&comma; హైదరాబాద్ మహిళా జైలులో 7 మంది ఉత్తీర్ణులయ్యారు&period; ఏడాది పాటు రెగ్యులర్ తరగతులు&comma; మాక్ టెస్టులు&comma; ప్రీ-బోర్డ్ పరీక్షలతో ఖైదీలను సిద్ధం చేశారు&period; వారి విద్య&comma; పునరావాసాన్ని ప్రోత్సహించేలా జైళ్ల శాఖ డీజీ à°¡à°¾&period; సౌమ్య మిశ్రా ప్రత్యేక డైరెక్టర్ జనరల్ రిమిషన్ ప్రకటించారు&period; ఇక SSC పాసైన ఖైదీలు NIOS ద్వారా 10&plus;2 చదువుతో పాటు&period;&period; చర్లపల్లి జైలులోని ITIలో సాంకేతిక&comma; వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తున్నారు&period; విద్య ద్వారా ఖైదీల్లో ఆత్మవిశ్వాసం&comma; నైపుణ్యాలను పెంచి&period;&period; సమాజంలో గౌరవప్రదమైన జీవితానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా జైళ్ల శాఖ ముందుకు సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్