రహదారి కావాలంటూ నల్గొండ జిల్లా గణపురం గ్రామస్తుల ధర్నా.

Advertisements

<p>తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు&period; బృందావన కాలనీకి రహదారి కావాలంటూ గుడిపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు&period; తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని&period;&period; అయినా కొందరు రాజకీయ కారణాలతో రహదారిని అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు&period; రహదారి లేకపోవడంతో సుమారు వంద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు&period; అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు&period; అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period; సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.