రైతుకు నీటి భరోసా.. సీఎం కీలక ఆదేశాలు.

Advertisements

<p>తెలంగాణలో సాగునీటి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు&period; హైదరాబాద్‌లోని MCR HRDలో ఇరిగేషన్&comma; పౌర సరఫరాల శాఖలపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు&period; ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీరు&comma; రిజర్వాయర్ల పరిస్థితి&comma; సాగునీటి విడుదలపై అధికారులతో చర్చించారు&period; ప్రధాన ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే సాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు&period; ఇదే సమయంలో రైస్ మిల్లర్ల వ్యవహారంపైనా సీరియస్ అయిన రేవంత్&period;&period; ప్రభుత్వం&comma; రైతులను ఇబ్బంది పెట్టేలా బ్లాక్‌మెయిల్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు&comma; రిజర్వాయర్లలోకి భారీగా నీటి ఇన్‌ఫ్లో వస్తోంది&period; ఈ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు&period; రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిన తర్వాతే పొలాలకు సాగునీరు విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period; పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి&period;&period; భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు&period; అందుబాటులో ఉన్న నీటి నిల్వలు&comma; ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు&period; ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు&period; మరోవైపు కేంద్రంతో జరుగుతున్న చర్చలపైనా సమీక్షలో ప్రస్తావన వచ్చింది&period; తుమ్మిడిహట్టి ప్రాజెక్టు&comma; ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల పురోగతిపై అధికారులతో చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; ఇదే సమావేశంలో పౌర సరఫరాల శాఖపై కూడా సీఎం రేవంత్ సీరియస్ రివ్యూ నిర్వహించారు&period; రైస్ మిల్లర్ల వ్యవహారాలు&comma; పెండింగ్ బకాయిలపై అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ప్రభుత్వం లేదా రైతులను ఇబ్బంది పెట్టేలా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు&period; మరోవైపు మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత అవకాశాలు కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు&period; పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్