నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .

Advertisements

<p>తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది&period; పోలీస్&comma; ఎక్సైజ్&comma; ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది&period; గతంలో ఇచ్చిన ఐదేళ్ల సడలింపునకు అదనంగా ఈ రెండేళ్లను జత చేసింది&period; అంటే&period;&period; మొత్తంగా యూనిఫాం ఉద్యోగాల అభ్యర్థులకు ఏకంగా 7 ఏళ్ల వయోపరిమితి సడలింపు లభించినట్లయింది&period; ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారికంగా జీవో జారీ చేశారు&period; ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులకు రాబోయే నోటిఫికేషన్లలో పోటీ పడేందుకు అవకాశం లభించింది&period;యూనిఫాం పోస్టుల భర్తీకి సంబంధించి వయోపరిమితిని సడలించాలని ఎంతో కాలంగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి&period; వయోపరిమితి ముగిసిపోవడం వల్ల తాము పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతున్నామని&comma; కాబట్టి వయోపరిమితిని సడలించి తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేశారు&period; అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం&period;&period; వయోపరిమితిని సడలించడమే సరైన నిర్ణయమని భావించింది&period; ఈ ఏడాది మే 18à°¨ విడుదల చేసిన జీవో నంబర్ 87 ద్వారా ఇప్పటికే ఐదేళ్ల వయోపరిమితిని పెంచిన ప్రభుత్వం&comma; ఇప్పుడు నిరుద్యోగుల అభ్యర్థన మేరకు దానికి అదనంగా మరో రెండేళ్లు పెంచుతూ సరికొత్త ఉత్తర్వులు ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వం జారీ చేసిన ఈ తాజా అడ్-హాక్ రూల్ ప్రకారం&period;&period; ఈ వయోపరిమితి సడలింపు అనేది పలు కీలక శాఖల్లో రాబోయే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుంది&period; పోలీస్&comma; ఫైర్ సర్వీసెస్&comma; జైళ్ల శాఖ&comma; స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ &comma; ఎక్సైజ్&comma; రవాణా &lpar;ట్రాన్స్‌పోర్ట్&rpar;&comma; అటవీ &lpar;ఫారెస్ట్&rpar; శాఖల్లోని యూనిఫాం పోస్టులన్నింటికీ ఈ ఏడేళ్ల అదనపు వయోపరిమితి సడలింపు లభిస్తుంది&period; దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ గెజెట్‌లో ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది&period; ఈ ఉత్తర్వుల కాపీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ &lpar;TSLPRB&rpar;&comma; తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు&comma; శాఖాధిపతులకు పంపించారు&period; రానున్న పోలీస్&comma; ఇతర రిక్రూట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది కొండంత అండగా నిలుస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.