22A భూములపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు.

Advertisements

<p>22A భూముల సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు&period; 22A జాబితాలో భూములు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు&period; ఈ సమస్యపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించడంతో పాటు… ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>22A భూములకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు&period; ఫిర్యాదు నమోదైన తర్వాత అది పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు సంబంధిత అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>తహసీల్దార్లు&comma; ఆర్డీవోలు&comma; సబ్‌రిజిస్ట్రార్‌లు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పొంగులేటి ఆదేశించారు&period; భూమి అసలు 22A జాబితాలోకి ఎందుకు చేరింది&quest; ఎలాంటి కారణాలతో నిషేధిత జాబితాలో నమోదైంది&quest; అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి… వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని స్పష్టం చేశారు&period; ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా… సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.