తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

Advertisements

<p>తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని&comma; ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు&period; ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే ఉంటుందని&comma; రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తదుపరి లక్ష్యమని చెప్పారు&period; భద్రాచలంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు&comma; నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన&period;&period; ఈ వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ఢిల్లీకి అక్రమ మార్గాల్లో మూటలు పంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు&period; గతంలో కేసీఆర్ పాలనలోనూ అదే మంత్రి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని విమర్శించారు&period; కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అందిస్తున్న ఉచిత సన్నబియ్యం&comma; ఇళ్ల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;<p>గతంలో రజాకార్ల పాలనను తలపించిన కేసీఆర్ ప్రభుత్వ మెడలు వంచింది బీజేపీయేనని బండి సంజయ్ పేర్కొన్నారు&period; తనపై 109 అక్రమ కేసులు నమోదైనా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని&comma; పోలీసు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు&period; దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని&comma; తెలంగాణలోనూ ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.