ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

Advertisements

<p>తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది&period; ఆయుర్వేద&comma; హోమియోపతి&comma; యునాని&comma; నాచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు&comma; పీజీ విద్యార్థుల స్టైఫండ్‌లను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; దీంతో హౌస్ సర్జన్ల స్టైఫండ్ రూ&period;13&comma;754 నుంచి రూ&period;29&comma;792కు&comma; పీజీ విద్యార్థుల స్టైఫండ్ రూ&period;34&comma;385 నుంచి రూ&period;74&comma;482కు పెరిగింది&period;<&sol;p>&NewLine;<p>తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చినందుకు ఆయుష్ విద్యార్థులు&comma; వైద్యులు సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు&period; గత పదేళ్లలో తమ స్టైఫండ్‌లను పెంచలేదని&comma; ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని మంత్రికి వివరించారు&period; తమ సమస్యను పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు&period; సుమారు 700 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లు&comma; 138 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామని చెప్పారు&period; సిద్దిపేట&comma; జయశంకర్ భూపాలపల్లి&comma; వికారాబాద్‌లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని&comma; కరీంనగర్‌లో రూ&period;15 కోట్లతో మరో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైందన్నారు&period; సాంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని ఆధునిక పద్ధతులతో అనుసంధానించి పరిశోధనలపై దృష్టి సారించాలని&comma; పేదలు&comma; గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని విద్యార్థులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.