ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.

Advertisements

<p>ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు&period; క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు&comma; పెరుగుతున్న పని ఒత్తిడి&comma; ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు&period; ముఖ్యంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడంపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆవేదనను కూడా జేఏసీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు&period; ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన రేవంత్‌రెడ్డి&period;&period; తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటానని హామీ ఇచ్చినట్లు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కే&period;గౌతమ్‌కుమార్&comma; ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి తెలిపారు&period; ఒక్కో సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని&period;&period; పీఆర్సీ కమిటీ నివేదిక కూడా వెంటనే తనకు అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్లు ట్రెసా నాయకులు తెలిపారు&period; ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించడంపై ట్రెసా రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది&period; ఉద్యోగుల హక్కులు&comma; సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేసింది&period; సీఎంను కలిసిన వారిలో ట్రెసా గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.