ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం

Advertisements

<p>తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది&period; ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి&period; పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు&period; బీఆర్ఎస్ అవినీతి&comma; కాంగ్రెస్ అసమర్థ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని&comma; ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు&period; అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు&comma; డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మోదీ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు తెరలేపింది&period; ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని తెలంగాణలో కూడా అమలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది&period; రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశముందనే చర్చలు సాగుతున్నాయి&period;<br &sol;>&NewLine;&lpar;&rpar;<br &sol;>&NewLine;భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కూడా కూటమి చర్చలు వేడెక్కుతున్నాయి&period; ముఖ్యంగా బీజేపీ&comma; తెలుగుదేశం&comma; జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు&period; అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు&comma; తాటి వెంకటేశ్వర్లు వంటి నేతలు కూటమి ఏర్పడితే తమ రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది&period; ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు పలు నియోజకవర్గాల్లో ఉన్న డాక్టర్లు&comma; ఇంజినీర్లు&comma; వ్యాపారవేత్తలు కూడా కూటమి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట&period; రాజకీయంగా స్థబ్దుగా ఉన్న పలువురు నేతలు మోదీ సభ తర్వాత మళ్లీ చురుకుగా మారారని చెబుతున్నారు&period; ముఖ్యంగా యువత&comma; ఉద్యోగ వర్గాలు&comma; మధ్యతరగతి ప్రజల్లో కూటమి పట్ల ఆసక్తి పెరుగుతోందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది&period; దీంతో జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>భద్రాద్రి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు బలమైన పునాది ఉండేది&period; ఉమ్మడి రాష్ట్ర కాలంలో బూర్గంపాడు&comma; ఇల్లందు&comma; భద్రాచలం&comma; కొత్తగూడెం ప్రాంతాల్లో టీడీపీకి గట్టి క్యాడర్ ఉండేది&period; డీలిమిటేషన్‌కు ముందు బూర్గంపాడు నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలవగా&comma; ఇల్లందులో ఊకే అబ్బయ్య విజయం సాధించారు&period; రాష్ట్ర విభజన తర్వాత కూడా 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు&period; ప్రస్తుతం ఈ నేతలు బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ&comma; కూటమి రాజకీయాలు వేగం పుంజుకుంటే మళ్లీ పాత రాజకీయ బంధాలు పునరుద్ధరించబడే అవకాశముందని ప్రచారం సాగుతోంది&period; అశ్వారావుపేట&comma; కొత్తగూడెం&comma; ఇల్లందు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ బలమైన ఓటు బ్యాంక్ ఇప్పటికీ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు&period; దీనికి బీజేపీ&comma; జనసేన క్యాడర్ తోడైతే కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని కూటమి వర్గాలు భావిస్తున్నాయి&period; ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభావం పెరిగే అవకాశముందని చర్చ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>శ్రీరాముడు కొలువైన భద్రాచలం నియోజకవర్గంపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది&period; హిందుత్వ&comma; సెంటిమెంట్ రాజకీయాలను ప్రధాన అజెండాగా తీసుకుని భద్రాచలంలో బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి&period; అదే సమయంలో కొత్తగూడెంలో జనసేన&comma; అశ్వారావుపేట&comma; పినపాక&comma; ఇల్లందు ప్రాంతాల్లో టీడీపీ బరిలో ఉంటే కూటమి జిల్లాలో కీలక శక్తిగా మారే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి&period; కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఎదిగేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది&period; మరోవైపు పలువురు మాజీ ఎమ్మెల్యేలు&comma; ఆశావాహులు&comma; వ్యాపారవేత్తలు&comma; సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు&comma; ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది&period; మోదీ సభ తర్వాత జిల్లాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిందని స్థానిక నాయకులు చెబుతున్నారు&period; రాబోయే ఎన్నికల నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కూటమి ఎంత ప్రభావం చూపుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..