కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Advertisements

<p>కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు&period; భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో చివరి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; గతంలో ప్రారంభమైన పనులు పూర్తికాని స్థితిలో ఉండగా&comma; కలెక్టర్ చిత్రా మిశ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో మిగిలిన పనులు పూర్తి చేయించారని తెలిపారు&period; ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగవంతం చేయడం వల్ల భవనం సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు&period; అదే కార్యక్రమంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు జాతీయ జెండా ఆవిష్కరణ కూడా జరుగుతుందని తెలిపారు&period;ప్రారంభం అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాలు అన్నీ కొత్త కలెక్టరేట్‌లోనే పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు&period; పాత కలెక్టరేట్ భవనాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు&period; అదేవిధంగా జిల్లా అధికారుల నివాస గృహాలు ఇప్పటికే ఉన్నవి సరిపోతున్నాయని&comma; వాటినే వినియోగిస్తామని తెలిపారు&period;మానేరు రివర్ ఫ్రంట్ రెండో దశ పనులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు&period; డంప్ యార్డు తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు కూడా ఆయన వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.