మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం

Advertisements

<p>మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది&period; జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ&period; భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు&period; చట్టప్రకారం ఆవులు&comma; దూడలను వధించడం పూర్తిగా నిషేధించామన్నారు&period; మూగజీవాలను తరలించేటప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్&comma; కౌస్లాటర్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేస్తామని డీసీపీ హెచ్చరించారు&period; అక్రమ రవాణాపై నిఘాకు జిల్లాలో ఏడు శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు&period; ఇదే సమయంలో గోరక్షక్ పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగినా&comma; వాహనాలు ధ్వంసం చేసినా ఊపేక్షించేది లేదని స్పష్టం చేశారు&period; మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..