తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం..

తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం

Advertisements

<p>సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా&period;&period; జనసంద్రం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించారు&period; ఒకవైపు వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల జాతర&period;&period;మరోవైపు &&num;8216&semi;వోకల్ ఫర్ లోకల్&&num;8217&semi; అంటూ స్వదేశీ మంత్రం విన్పించారు&period; బెంగాల్ విజయోత్సాహం&period;&period; తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు ప్రధాని మోదీ&period; సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనసంద్రం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఒక ప్రభంజనంలా సాగింది&period; &OpenCurlyQuote;నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా&period;&period; మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు&period; &&num;8216&semi;తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది&&num;8217&semi; అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు&period; కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా&comma; రైల్వేలు&comma; జాతీయ రహదారులు మరియు మౌలిక సదుపాయాల కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణలో కుటుంబ పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు&period; తెలంగాణ గడ్డపై బీజేపీకి ఆది నుంచీ ఆదరణ ఉందని&comma; పార్టీకి ఇద్దరు సభ్యులే ఉన్న కాలంలో కూడా ఒకరు ఈ గడ్డ నుంచే ఉన్నారని గుర్తు చేశారు&period; బీజేపీపై పెరుగుతున్న ఈ అభిమానం రాబోయే ఎన్నికల్లో మార్పుకు సంకేతమని&comma; &&num;8216&semi;అబ్ కీ బార్&period;&period; బీజేపీ సర్కార్&&num;8217&semi; నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు&period; ప్రజల నుంచి లభిస్తున్న ఈ ప్రేమే తనను మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తోందన్నారు&period; తెలంగాణలో శాంతి భద్రతలు నెలకొనాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాని తన ప్రసంగంలో &OpenCurlyQuote;వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని నొక్కి చెప్పారు&period; విదేశీ వస్తువుల వ్యామోహం వీడి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని&comma; అప్పుడే భారతమాతను కాపాడుకున్న వాళ్లం అవుతామని పిలుపునిచ్చారు&period; వంటనూనెల వినియోగం తగ్గించాలని&comma; పెట్రోల్ వినియోగం పై ఆధారపడటం తగ్గించాలని సూచించారు&period; చమురు దిగుమతుల భారం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు&comma; మెట్రో మరియు రైల్వేలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు&period; దేశం ఆత్మనిర్భర్ కాకుండా చేసే శక్తులకు మనం దూరంగా ఉండాలని హెచ్చరించారు&period; రాగి వంటి ఖనిజాల కోసం గతంలో అడ్డంకులు సృష్టించడం వల్ల ఇప్పుడు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి&period; రేవంత్ సర్కార్ అందరినీ వెన్నుపోటు పొడిచిందని&period;&period; అబద్ధపు హామీలతో ప్రజలను వంచిస్తోందని నిప్పులు చెరిగారు&period; పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి &&num;8230&semi;ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి&quest; అని ప్రశ్నించారు&period; తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వ పాత్రను గణాంకాలతో సహా వివరించారు&period; గత 11 ఏళ్లలో రాష్ట్రానికి ఏకంగా 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని&period;&period; హైవేలు&comma; వందే భారత్ రైళ్లు&comma; రైల్వే స్టేషన్ల అభివృద్ధి మోదీ చలవేనని స్పష్టం చేశారు&period; చివరికి రాష్ట్రంలో ఇచ్చే సన్నబియ్యం పథకానికి కూడా 80 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని గుర్తు చేశారు&period; &&num;8216&semi;పదేళ్లు ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ&period;&period; ఇప్పుడు గాంధీ కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది&&num;8217&semi; అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; సీఎం రేవంత్ రెడ్డి కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు&period; ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలకు తెరలేపిందని&comma; &&num;8216&semi;SIR&&num;8217&semi; పేరుతో ప్రభుత్వం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని మండిపడ్డారు&period; దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటమే మా పనితీరుకు నిదర్శనమన్నారు&period; తెలంగాణ విముక్తి చెందాలంటే అది కేవలం &&num;8216&semi;మోదీ గ్యారంటీ&&num;8217&semi;తోనే సాధ్యమని పునరుద్ఘాటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..