102
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు. గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. వారిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండగా అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్న తిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున (30), శ్రీనివాసులు(30) గా పోలీసులు గుర్తించారు.