55
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదని అర్ధమౌతోందని వ్యాఖ్యానించింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని , అప్పటికి నిర్ధేశించిన అంశాల్లో కొన్ని పూర్తి చేసుకుని రావాలని ఆదేశించింది. ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సమావేశం నిర్వహించారు.