దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది…

Advertisements

<p>దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది&period; అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది&period; ఖరీఫ్ సీజన్ లో పీ అండ్ కే ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది&period; ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సెంట్రల్ కెబినెట్ సమావేశం జరింగింది&period; ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది&period; కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వనీకుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ పీ అండ్ కే ఎరువులకు రూ&period; 41&comma;543 కోట్ల రాయితీకి కేబినెట్ ఆమోద ముద్రవేసిందని పేర్కొన్నారు&period; అలాగే రూ&period; 13 వేల కోట్లతోయజపుర మెట్రో ప్రాజెక్టు రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>భారతదేశ ఇంధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనున్న రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది&period; కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు&period; హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈక్విటీ భాగస్వామ్యం మరియు ప్రాజెక్టు వ్యయ సవరణలపై స్పష్టతనిచ్చారు&period;ఈ రిఫైనరీలో వాణిజ్య కార్యకలాపాలు జూలై 2026 నుండి కార్యాకలాపాలు ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు&period; ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా అవతరించిందని మన ప్రస్తుత రిఫైనింగ్ సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉందని పేర్కొన్నారు&period; ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం పేరుగుతుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..