పారిశ్రామికవేత్తలతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక భేటీ..

Advertisements

<p>రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది&period; తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్&period;&period; పారిశ్రామికవేత్తలకు కీలక హామీలు ఇచ్చారు&period; పెట్టుబడిదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా&comma; రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు&period; శ్రీసిటీలో కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలపై మంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి&period;రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విద్యుత్ కోతలు లేని సరఫరానే ప్రధానమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు&period;రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోందని&comma; దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు&period; శ్రీసిటీలో ప్రస్తుతం 70 వేల మందికి ఉపాధి లభిస్తుండగా&comma; భవిష్యత్తులో ఈ సంఖ్యను ఒకటిన్నర లక్షలకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు&period;ముఖ్యంగా&comma; గత ప్రభుత్వాల హయాంలో పెరిగిన భారాన్ని తగ్గించేలా&period;&period; సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ చార్జీలను &&num;8216&semi;ట్రూ డౌన్&&num;8217&semi; చేశామని గుర్తు చేశారు&period; వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రజలకు&comma; పరిశ్రమలకు విద్యుత్ చార్జీల భారం తగ్గించి తీరుతామని మంత్రి భరోసా ఇచ్చారు&period; స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు విద్యుత్ రాయితీలు ఇస్తామని&comma; ఏపీని ఇన్వెస్టర్ల స్వర్గధామంగా మారుస్తామని గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.