83
విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా, సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. కార్మిక మరియు ప్రతిపక్ష నాయకులతో కలిసి కంపెనీ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీలో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.