ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు (38) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు. పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు. స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు, ముమ్మరం చసి మృతదేహం వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Accidental death
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా లో సంతోషి ఆయిల్ కంపెనీ లోకి లోడింగ్ కు వెళుతున్న మినీ వ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు (70)గా గుర్తించారు. డోర్ తెరుచుకోక పోవడం కారణంగా సజీవదహనం అయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకుని కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి, కాకినాడ రూరల్ MRO మొరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీ కృష్ణ విచారణ చేపట్టారు.
Read Also..
విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా, సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. కార్మిక మరియు ప్రతిపక్ష నాయకులతో కలిసి కంపెనీ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీలో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు సావరగూడెం చెరువులో పడి గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విజయవాడ పటమట కు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కోసం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎన్ఎస్ఎమ్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. ఫోటో షూట్ నిమిత్తం సావరగూడెం శివారు కొండ చెరువు వద్దకు చేరుకున్నారు. మృతులు గుజ్జర్లపూడి అంకిత్(15), నడికుదిటి శశి వర్ధన్(14)గా గుర్తించారు.
శ్రీశైలం అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న హెలిప్యాడ్ గ్రౌండ్ పక్కన ఉన్న చెక్ డ్యామ్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. చెక్ డ్యామ్ లో నీటిపై తెలియాడుతున్న మృతదేహాన్ని బహిర్భకి వెళ్లిన స్థానికులు కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు చేరుకొని మృతదేహాన్ని చెక్ డ్యామ్ నుండి పోలీసులు బయటకు తీశారు. అయితే గుర్తు తెలియని మృతదేహనికి సంబంధించి వివరాలు ప్రకారం శ్రీశైలానికి చెందిన వెంకట్ నారాయణ కుమారుడు నాగరాజు గా గుర్తింపు. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయి చివరికి మిగతాజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు పర్యాంతరమయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.
డాక్టర్ నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదంలో కార్మికుడు దుర్మరణం…. డాక్టర్ ఎన్టీటిపిఎస్ లోని కోల్ ప్లాంట్ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టేజ్ 1&2లో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్న శౌరీ ప్రమాదవశాత్తు కోల్ బెల్టు పై పడటంతో ఈప్రమాదం జరిగింది. వేరే స్టేజ్ లో పనిచేస్తున్న శౌరీని స్టేజ్ 1&2లోకి మార్చడం వల్లనే ఈప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు.






Total views : 149166