దుమ్మురేపుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు….

Domestic stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి&period; మదుపరులపై లాభల వర్షం కురిపించాయి&period; అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన మార్కెట్‌లు భారీ లాభాలతో ముగిశాయి&period; ఉదయం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే బీఎస్ సెన్సెక్స్ 343 పాయింట్లు వృద్ధి చెందింది&period; మధ్యలో కొంత తగ్గినట్లే తగ్గి పెరిగింది&period; మార్కెట్లు ముగిసే సమయానికి 719 పాయింట్లు బలపడి 66&comma;876 పాయింట్ల వద్ద తన పరుగు ముగించింది&period; ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ -నిఫ్టీది కూడా అదే బాట&period; ప్రారంభంలోనే 104 పాయింట్లు పెరిగింది&period; ఇంట్రాడేలో కాస్త తగ్గినట్లే తగ్గిన నిఫ్టీ మళ్లీ ఊపందుకుంది&period; చివరకు 207పాయింట్లు పెరిగి 20&comma;097 వద్ద నిఫ్టీ ముగిసింది&period; ఫైనాన్స్&comma; పవర్‌‌&comma; ఫార్మా&comma; ఆటో షేర్లు దుమ్మురేపాయి&period; వడ్డీరేట్లను ఇప్పట్లో మరింత పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం వచ్చింది&period; మదుపరుల్లో విశ్వాసం నెలకొంది&period; ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడిదారుల సంపద పెరిగిందని అంచనా&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.