రైలు ప్రయాణీకులను వేగంగా గమ్యాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రైస్ ట్రైన్లకు ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 34 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పగటిపూట నడుస్తుండగా… తొలిసారి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కూడా వందే భారత్ ఈ సేవలను ప్రారంభించనుంది. సౌత్ సెంట్రల్ రైల్వే తొలిసారిగా 2023 నవంబర్ 21న ఈ ట్రైన్ సేవలను ప్రారంభించనుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య సెమీ హై స్పీడ్ వందే భారత్ రైల్ ను రాత్రిపూట నడపనున్నారు. మరో వందే భారత్ స్పెషల్ ట్రైన్ యశ్వంత్ పూర్-బెంగళూరు నుండి చెన్నై సెంట్రల్ మధ్య నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి 8 కోచ్ ల వందేభారత్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 21న రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇక ఐదున్నర గంటల్లోనే గమ్యాన్ని ఈ ఎక్స్ ప్రెస్ చేరుకుంటుంది. ప్రయాణీల నుంచి రెస్పాన్స్ ను బట్టి మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించే ఆలోచన చేస్తామని అధికారులు తెలిపారు.
రాత్రి పూట నడిచే తొలి వందే భారత్ ట్రైన్..
85
previous post