74
జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, ఎస్సై నాగార్జున రాజుకు వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బందితో గొల్లలగుంట గ్రామంలోని శివారు తుప్పల మాటున 7 డ్రమ్ములలో సారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. గ్రామాలలో సారా తయారుచేసిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు..