నీటి కోసం జులుం సరైనది కాదు నాగార్జునసాగర్ నీటి కోసం జులుం ప్రదర్శించారు ఆంధ్రా అధికారులు. నీటి విడుదల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఏకంగా గేట్లను ఎత్తుతామని ఆంధ్రా అధికారులు ప్రాజెక్టు వద్ద హల్చల్ సృష్టించారు. రాష్ట్ర పోలీసులు తోడయ్యారు. ఇది సరికాదని, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానా రెడ్డి వ్యాఖ్యానించారు నాగార్జునసాగర్ డ్యాం నీటి సమస్య ఉంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. ఆంధ్ర పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పై విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులపై దాడి చేయడం సరైనది కాదని కృష్ణ రివర్ బోర్డ్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని కోరారు.
సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి – జానారెడ్డి
74