మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం

Congress party,BJP party, janata party

Advertisements

&NewLine;<p>ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు&period; రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు&period; ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నలోపం మాత్రం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రచారంలో ఏమాత్రం తగ్గేది లేదన్నట్టుగా అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు&period; జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజవర్గంలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి&period; నేనంటే నేను అనే రీతిలో ఎవరికీ తోచిన విధంగా వారు ఢీ అంటే డీ అంటున్నారు&period; బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందన్నారు&period; రాబోయే కాలంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు&period; భూపాలపల్లిలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు&period; ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న తనను ముచ్చటగా మూడోసారి గెలిపిచాలని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు&period; ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ సర్కార్ మాటలు తప్ప చేసిందేమీ లేదన్నారు&period; భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు&period; నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని సత్యనారాయణరావు తెలిపారు&period; అటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని రాష్ట్రంలో బిజెపికి అధికారం అప్పగిస్తే తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు&period; మీ యొక్క ఆడబిడ్డగా నన్ను గెలిపిస్తే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తానని కీర్తి రెడ్డి తెలిపారు&period; మొత్తానికి ఎవరూ తోచిన విధంగా వారు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు&period; మరి ఓటరు మహాశయుడు ఎవర్ని కరుణిస్తాడో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..