కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి. సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు. దాదాపు పదికి పైగా విదేశీ షిప్లు నిలిచిపోయాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని, వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్ వాకలపూడి, హార్బార్పేట, తూరంగి హోప్ ఐలాండ్ కాలనీల్లో ఆయన పర్యటించారు. వాకలపూడి హైస్కూల్లో పునరావాస సహాయ కేంద్రం ఏర్పాటుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అల్లకల్లోలంగా మారిన సముద్రం..
63
previous post