82
కర్ణాటక రాష్ట్రం షోలాపూర్ పట్టణవాసులు తుఫాన్ వాహనంలో శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటి కుంట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం టైర్ పంచరై అద్భుతప్పి బోల్తా కొట్టి సమీప పొలాల్లోకి నాలుగు పల్టీలు కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 17 మందిలో 12 మందికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని 108 వాహనం లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.