Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Andhra PradeshChittoor 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

15ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

by Rama
red sandle ride

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. ఆయన సోమవారం టాస్క్ ఫోర్సు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వీరి నుంచి 15ఎర్రచందనం దుంగలు, 20గొడ్డఃళ్లు, 20 సెల్ ఫోన్లు, టాటా కంపెనీ లారీ, బొలేరో వాహనంతో పాటు రూ.24వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్నూలు రేంజి డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలు –చీమకుర్తి రోడ్డు వద్ద సంతనూతలపాడు పోలీసు స్టేషను సమీపంలో తనిఖీలు చేస్తుండగా వీరిని గుర్తించినట్లు తెలిపారు. వీరిని చట్టుముట్టే ప్రయత్నం చేయగా, కొందరు తప్పించుకున్నారని, 31మందిని పట్టుకోగలిగినట్లు చెప్పారు. పట్టుబడిన వారిలో ప్రధాన ముద్దాయి గుద్దేటి రామనాథ రెడ్డి, (37)కాగా ఇతను నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వ్యక్తి. ఇతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో 60కేసులు ఉన్నాయని, 4ఎన్బీడబ్ల్యూకల మోస్ట్ వాంటెడ్ ముద్దాయిగా పేర్కొన్నారు. ఇతనితోపాటు తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన మేస్త్రి రాజికుప్పుస్వామి(46)లుగా గుర్తించారు. మిగిలిన వారు తమిళనాడు నుంచి రాజికుప్పుస్వామికి చెందిన కూలీలుగా గుర్తించినట్లు చెప్పారు. వీటిలో దుంగలు విలువ రూ.25లక్షల వరకు ఉండగా, వాహనాలు రూ.20 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులను సిఫారసు చేసినట్లు చెప్పారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేయగా, సీఐ జీ. శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ ఆర్ఐఎస్ లు, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

041213
Total views : 214674

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: