71
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాశీ పాలెం వద్ద ఓ ఇంట్లో గత రాత్రి ఎవరు లేని సమయం చూసి దొంగలు చొరబడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంటి యజమాని ఝాన్సీ తెలిపిన వివరాల మేరకు ఈరోజు మధ్యాహ్నం ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని రెండు బీరువాలను ధ్వంసం చేసి బీరువాల్లో ఉన్న ఐదుసార్లు బంగారం, వెండి పట్టీలు, పదివేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.