కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష..

కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష

Advertisements

<p>తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి&period; TVK ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది&period; ఈ బలపరీక్ష విజయ్ ప్రభుత్వ భవిష్యత్తునే కాకుండా&comma; ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన అన్నాడీఎంకే పార్టీ మనుగడను కూడా నిర్దేశించనుంది&period; పార్టీలో మొదలైన తిరుగుబాటుతో అన్నాడీఎంకే చీలిక అంచున నిలిచింది&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను&comma; విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుంది&period; ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు 10అడుగుల దూరంలో నిలిచింది&period; దీంతో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్&comma; వీసీకే&comma; సీపీఐ&comma; సీపీఎం&comma; IUML మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు&period; ఈ కూటమితో ప్రభుత్వానికి ఢోకా లేనప్పటికీ&comma; అనూహ్యంగా అన్నాడీఎంకేలోని రెబల్ వర్గం నుంచి విజయ్‌కు మద్దతు లభించింది&period; సీనియర్ నేతలు షణ్ముగం&comma; వేలుమణి నేతృత్వంలోని రెబల్ వర్గం తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది&period; విజయ్ స్వయంగా షణ్ముగం నివాసానికి వెళ్లి మద్దతు కోరగా వారు అంగీకారం తెలిపారు&period; అయితే&comma; మరోవైపు అన్నాడీఎంకే అధికారిక నాయకత్వం&comma; ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వర్గం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ 47 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది&period; విప్‌ను ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;<p>పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం&comma; ఒక పార్టీ చీలికగా గుర్తింపు పొందాలంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు &lpar; అంటే&period;&period;47 మందిలో 32 మంది&rpar; ఒకేతాటిపై ఉండాలి&period; రెబల్ వర్గం 32 మంది మద్దతును కూడగడితే&comma; వారు అనర్హత వేటు నుంచి తప్పించుకుని&comma; అన్నాడీఎంకే అధికారికంగా చీలిపోతుంది&period; దీంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుంది&period; లేనిపక్షంలో&comma; రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వస్తుంది&period; జయలలిత మరణానంతరం నిరంతర సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకే భవిష్యత్తు ఇవాల్టి బలపరీక్షతో తేలిపోనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..