తమిళనాడు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్..

తమిళనాడు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో &ZeroWidthSpace; అంచనాలను తారుమారు చేసి ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ&comma; ప్రస్తుతం గవర్నమెంట్&ZeroWidthSpace; ఏర్పాటుకు సిద్ధమౌవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది&period; మ్యాజిక్ ఫిగర్ 118 సంఖ్యాబలం లేక&period;&period; గవర్నర్ అనుమతి నిరాకరించడంతో విజయ్ నేటి ప్రమాణస్వీకారం రద్దయ్యింది&period; టీవీకే పార్టీ అధినేత&comma; ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే ను&period;&period; ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది&period; తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు&period; కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైనట్లు తెలుస్తోంది&period; రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్‌కు&comma; సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గవర్నర్ గుర్తుచేశారు&period; తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో తమిళనాడులో సస్పెన్స్ కు తెరలేపింది&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118&period; అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు&period;&period; విజయ్ రెండు చోట్లా గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది&period; కాబట్టి నికరంగా 107 సీట్లు &period; మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు&period; దీంతో మొత్తం బలం 112 అవుతుంది&period; ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది&period; ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది&period; కాగా&&num;8230&semi; కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని&comma; ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని విజయ్ గవర్నర్ కు వివరించారు&period; అయితే&comma; ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది&period; కాగా&&num;8230&semi;అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం&period;&period; సుమారు 35 మంది విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది&period; మరోవైపు&comma; పీఎంకే &lpar;4&rpar;&comma; ఐయూఎంఎల్ &lpar;2&rpar;&comma; సీపీఐ &lpar;2&rpar;&comma; సీపీఎం &lpar;2&rpar; వంటి పార్టీల మద్దతు కూడగట్టడంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సాధించడానికి టీవీకే పార్టీకి10 సీట్లు అవసరమయ్యాయి&period; ఇప్పటికే టీవీకే కు కాంగ్రెస్ మద్దతు తెలుపగా&comma; అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది&period; టీవీకేతో పొత్తు పెట్టుకునే విషయంపై తమ పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని సీవీ షణ్ముగం స్పష్టం చేశారు&period; ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్&ZeroWidthSpace; కూడా స్పందించారు&period; పార్టీలో విభేదాలు&comma; చీలికలు లేవని స్పష్టం చేశారు&period; అలాగే&comma; ఏఐఏడీఎంకే&comma; టీవీకే వర్గాల మధ్య సఖ్యత మొదలైందన్నారు&period; హైకమాండ్&ZeroWidthSpace; నిర్ణయం కోసం వేచి ఉండాలని చెప్పారు&period; &period; ఇదిలా ఉండగా&comma; పొత్తును కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్&period; ఆనంద్ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె&period; పళనిస్వామితో సమావేశమయ్యారు&period; కాంగ్రెస్&period;&period; తన మిత్రపక్షాలైన వీసీకే&comma; వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; కానీ&period;&period;ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప&period;&period; విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు&quest; తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ టీవీకే ఎమ్మెల్యేలు రిసార్ట్ లోకి వెళ్లాలని విజయ్ ఆదేశించడంతో తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..