పార్లమెంట్‌లో ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల దుమారం..

Advertisements

<p>తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి&period; కాంగ్రెస్ నాడు అత్యంత దారుణంగా ఏపీ&comma; తెలంగాణను విభజించిందని&period;&period;ఆ విభజన బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు తేజస్వి సూర్య&period; విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని ఆయన కామెంట్స్ చేశారు&period; అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఎంపీ తేజస్వి కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు&period; ఆయన వ్యాఖ్యలు అత్యంత అజ్ఞానంతో కూడుకున్నవని&comma; అవి ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు&period; తేజస్వి చేసిన వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు&period; రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రాన్ని అవమానించినందుకు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు&period; ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపీ ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; పార్లమెంట్ వేదికగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య&comma; వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు&period; దశాబ్దాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణను&comma; రక్తపాతంతో కూడిన విభజనతో పోల్చడం అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు&period; తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను సహించే ప్రసక్తే లేదన్నారు&period;<&sol;p>&NewLine;<p>అయితే బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ నేతల విమర్శలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు&period; తెలంగాణ ఏర్పాటుపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్&comma; కాంగ్రెస్ నేతలు కావాలనే రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు&period; తేజస్వి సూర్య ఉద్దేశం తెలంగాణను కించపరచడం కాదని ఆయన స్పష్టం చేశారు&period; విభజన సమయంలో చోటుచేసుకున్న అశాస్త్రీయ పరిణామాలను మాత్రమే తేజస్వి ప్రస్తావించారని&period;&period; దానిని బీఆర్‌ఎస్&comma; కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు&period; పార్లమెంట్‌లో నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని&period;&period; బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా&quest; అని ఆయన సూటిగా ప్రశ్నించారు&period; తెలంగాణ ఏర్పాటు సమయంలో లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు కనీసం ఇద్దరు సభ్యులు కూడా లేరని&comma; కేవలం తమ పార్టీ మద్దతుతోనే బిల్లు పాస్ అయిందన్న నిజాన్ని గ్రహించాలని గుర్తు చేశారు&period; ఇక తెలంగాణను ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎన్నోసార్లు యూటర్న్‌లు తీసుకుందని&comma; ఆ పార్టీ ద్వంద్వ వైఖరి వల్లే ఉద్యమం సుదీర్ఘకాలం సాగిందని రాంచందరర్ రావు ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.