ఉత్తరకాశి సొరంగ ప్రమాదం : 41 మంది కార్మికులను రక్షించేందుకు 5 మార్గాలు

Uttarkashi tunnel accident

Advertisements

&NewLine;<p>ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ ఎనిమిదో రోజు కొనసాగుతోంది&period; సిల్క్యారా టన్నెల్ నుంచి కార్మికులను ఖాళీ చేయడానికి ఐదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ప్రభుత్వ నిర్ణయంపై సమాచారం ఇచ్చారు&period; కేంద్ర ప్రభుత్వం శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది&period; ఈ సమావేశంలోనే కార్మికులను రక్షించడానికి ఈ ఐదు ప్రణాళికలను సిద్ధం చేశారు&period; ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన తర్వాత గత ఏడు రోజులుగా అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ప్రభుత్వం మల్టీవిటమిన్‌లు&comma; యాంటీ డిప్రెసెంట్స్‌తో పాటు డ్రై ఫ్రూట్స్‌ను పంపుతున్నట్లు అనురాగ్ జైన్ తెలిపారు&period; ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక చార్ధామ్ &OpenCurlyQuote;ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తోంది&period; నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది&period; సిల్క్యారా వైపు నుంచి భూగర్భం లోపల 270 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో 30 మీటర్ల మేర గత ఆదివారం ఉదయం కూలిపోయింది&period; దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకున్నారు&period; వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్