ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణు దేవ్ సాయి

Vishnu Dev Sai

Advertisements

&NewLine;<p>గిరిజన నేత&comma; కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయిని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది&period; రాష్ట్రంలో ఇంతవరకూ అతిపెద్ద నాయకుడిగా ఉన్న మాజీ సీఎం రమణ్ సింగ్‌కు అత్యంత సన్నిహతుడుగా విష్ణు దేవ్ సాయికి పేరుంది&period; 59 ఏళ్ల విష్ణు దేవ్ 2006లో పార్టీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు&period; బీజేపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు&period; 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ఉక్కు శాఖ జూనియర్ మినిస్టర్‌గా పని చేశారు&period; కాగా&comma; సీఎం ఎంపిక కోసం రాయపూర్‌లో ఆదివారం నాడు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై విష్ణుదేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది&period; ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా&comma; సర్బానంద్ సోనోవాల్&comma; పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజర్యయారు&period; ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికార కాంగ్రెస్‌ను ఓడించి 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీని సాధించింది&period; నార్త్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకూరి నియోజకవర్గం నుంచి విష్ణుదేవ్ సాయి పోటీ చేసి గెలుపొందారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.