విదేశీ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు..

విదేశీ పర్యటనలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు

Advertisements

<p>విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది&period; ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 37 మంది ఉపాధ్యాయుల బృందం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సింగపూర్ పర్యటనకు బయలుదేరింది&period; 9à°µ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు అక్కడి అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు&period; ముఖ్యంగా సింగపూర్‌లోని పాఠశాలల్లో అమలు చేస్తున్న డిజిటల్ లెర్నింగ్&comma; స్మార్ట్ క్లాస్‌రూమ్స్ మరియు విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులపై వీరు ప్రత్యేక దృష్టి సారించనున్నారు&period; అక్కడి క్రమశిక్షణ&comma; పాఠశాల నిర్వహణలోని పారదర్శకతను పరిశీలించి&comma; మన రాష్ట్రంలో కూడా అవే ఉన్నత ప్రమాణాలను ప్రవేశపెట్టడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం&period; ఈ విదేశీ విద్యా పర్యటన మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంలో మైలురాయిగా నిలుస్తుందని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..