గిరిజనుల ఘన సంబరం – ఇటుకుల పండుగ ప్రారంభం…

Advertisements

<p>అల్లూరి జిల్లా చింతపల్లి&comma; జీకే వీధి&comma; కొయ్యూరు &comma; జి మాడుగుల పాడేరు మండలాల్లో గిరిజనులు ఇటుకుల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు&period;దీనినే విత్తనాలు పండుగ అని కూడా గిరిజనులు చెప్పుకుంటారు&period; కొన్ని ఏళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెల ఆఖరి నుంచి ఏప్రిల్ 10వ తేదీ లోపు 15 రోజులు పాటు చాలా ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు&period; ముందుగా ఈ పండుగ మొదటిరోజు కొత్తకుండ తో కొండ మీద ఉన్నటువంటి ఊట నీరు తెచ్చి ఆ ఊట నీరుతో బోనాలు వండి గ్రామ దేవత శంఖు దేవుని కి బోనాలు పెట్టి పూజిస్తారు &period; తమ పనిముట్లను&comma; ఆయుధాలను శంఖు దేవుని ముందు పెడతారు &period; పండుగ మొదటి రోజు సాయంత్రం కోడి గుడ్డును బాణాలతో కొట్టడం వీళ్ళ ఆచారం&period; బాణం తో కోడిగుడ్డు కొట్టిన వాళ్ళను గ్రామస్థులంతా కలసి సన్మానిస్తారు&period; బాణం తో గుడ్డు కొట్టని వారిపై బురద నీళ్లు&comma; పేడ నీళ్లు ఆడవారు మగవారిపై పోస్తారు &period; ఆ తర్వాత రోజు నుంచి అడవులకు వేటకు వెళ్లి ఏదైనా జంతువు లేదా పక్షినైన వేటాడుతారు ఆ వేట మాంసాన్ని గ్రామస్తులంతా సమానంగా పంచుకొని విందు ఏర్పాటు చేసుకొని తింటారు&period; ఒకవేళ వేటకు వెళ్ళిన వాళ్ళు ఏ జంతువును కూడా వేటాడుకుంటా గ్రామానికి తిరిగి వస్తే&comma; గ్రామంలో ఆడవాళ్లు అందరూ కలిసి పేడ నీళ్లు&comma; బురద నీళ్లు&comma; మగవారిపై పోయడం వీళ్ళ ఆచారం &period;<&sol;p>&NewLine;<p>అలాగే ఈ పండుగ రోజులు ఎవరైనా గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్లినట్లయితే వారికి జరిమానా వేస్తారు&period; ఈ పండుగ పూర్తి అయ్యేవరకు సాయంత్రం వేళల్లో డప్పులు&comma; వాయుధ్యాలతో&comma;దింసా నృత్యాలతో చాలా సంతోషంగా గడుపుతారు&comma; ఆడవాళ్లు అందరూ కలిసి వారం రోజులపాటు రోడ్లకు అడ్డంగా వెదురు కర్రతో కానీ తాడుతో గాని ఒక గేటును ఏర్పాటు చేసి రోడ్లమీద తిరిగే ప్రయాణికులను ఆపి వారి వద్ద నుంచి భరణం పేరుతో డబ్బులు వసూలు చేస్తారు&period; భరణం డబ్బులు ఇచ్చిన వాళ్లకు తమ గ్రామ దేవత శంఖు దేవుని దగ్గర పూజించినటువంటి పసుపు&comma; కుంకుమతో వాళ్లకు బొట్టు పెట్టి&comma; వాహనాలకు కూడా బొట్టులు పెడతారు&period; డబ్బులు ఇవ్వని వారిపై రంగు నీళ్లు&comma; బురద నీళ్లు&comma; పేడ నీళ్లు జల్లుతారు&period; పండుగ చివరి రోజున వారం రోజులు నుంచి వసూలు చేసిన డబ్బులతో పిండి వంటలు వండి తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ దేవత శంఖు దేవుని పూజించి&comma;తమ ఇళ్లల్లో ఆటకల మీద దాచినటువంటి విత్తనాలు పొలాల్లోచల్లుతారు &period;ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకొని ఈ పండుగను ముగిస్తారు&period;మరుసటి రోజు నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.