కురుపాం సీహెచ్‌సీలో సేవలు జోరు… వసతులు పూర్..

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు బాగానే ఉన్నా వసతుల లేమితో రోగులు ఇబ్బందులు పడుతున్నారు &period;డాక్టర్ల సైతం మౌలిక సదుపాయాలు అందించాలని కోరుతున్నారు &period;దీనిపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కధనం &period;<br &sol;>&NewLine;పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం… ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రాణాధారంగా మారింది&period; అటవీ ప్రాంతాలు&comma; దూర గ్రామాల మధ్య ఉన్న ఈ ఆసుపత్రి వేలాది మందికి ఆశగా నిలుస్తోంది&period; పరిమిత వసతులు ఉన్నప్పటికీ&comma; ఇక్కడి వైద్యులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు&period; ప్రస్తుతం ఏడుగురు యువ వైద్యులు రోజుకు 200 మందికి పైగా రోగులకు ఓపి సేవలు అందిస్తూ&comma; నెలకు సుమారు 6000 మందికి చికిత్స చేస్తున్నారు&period; గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తూ నెలకు 30 నుంచి 35 ప్రసవాలు నిర్వహించడం ఈ కేంద్రం ప్రాధాన్యతను చూపుతోంది&period; అత్యవసర సమయాల్లో వైద్యులు సమన్వయంతో పనిచేస్తూ అనేక ప్రాణాలను కాపాడుతున్నారు&period; ఇలాంటి పరిస్థితుల్లో కూడా సేవలు ఆపకుండా ముందుకు సాగుతున్న ఈ కేంద్రం నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది&period; అయితే ఇంతటి కీలక కేంద్రానికి తగిన వసతులు లేకపోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది&period;ఈ పరిస్థితుల్లో యువ వైద్యులు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నారు… &OpenCurlyDoubleQuote;తగిన వసతులు కల్పిస్తే ఇంకా మెరుగైన సేవలు అందించి మరింత మంది ప్రాణాలను కాపాడగలం” అని వారు అంటున్నారు&period; ఈరోజుల్లో అలాంటి వారి నిబద్ధత&comma; సేవా భావం ప్రశంసనీయం అని చెప్పాలి &period;<br &sol;>&NewLine;కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య సేవలు సమర్థంగా కొనసాగుతున్నప్పటికీ&comma; వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది&period; ఒకే గదిలో నలుగురు వైద్యులు కలిసి ఓపి నిర్వహించాల్సి రావడం&comma; ఒకే బెడ్‌పై ఇద్దరు లేదా ముగ్గురు రోగులు చికిత్స పొందడం వంటి పరిస్థితులు ఆసుపత్రి దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి&period; 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ&comma; సదుపాయాలు మాత్రం పెరగకపోవడం సమస్యను మరింత తీవ్రమైంది&period; రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు ఒత్తిడిని ఎదుర్కొంటూ సేవలు అందిస్తున్నారు&period; అయినప్పటికీ తమ బాధ్యతను మరిచిపోకుండా ప్రజలకు సేవ చేయడం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది &period; ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ఒకటే ఆధారం కావడంతో&comma; ఇక్కడి పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది&period;<br &sol;>&NewLine;కురుపాం ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన మరో ముఖ్య అంశం కొత్త భవనం ప్రారంభంలో జాప్యం&period; అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న కొత్త భవనం అందుబాటులోకి వస్తే&comma; రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది&period; కానీ ప్రారంభంలో ఆలస్యం జరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయి&period; ఏజెన్సీ ప్రాంతానికి కీలకమైన ఈ కేంద్రంలో మౌలిక వసతులు మెరుగుపడితే ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పు రావచ్చు&period; మరి అధికారులు వెంటనే స్పందించి కొత్త భవనాన్ని ప్రారంభించి&comma; అవసరమైన సదుపాయాలు కల్పిస్తారా&quest; అనేది ఇప్పుడు ప్రజల ఆశగా ఎదురుచూస్తున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.