కొవ్వూరులో వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ లోపం..

Advertisements

<p>కొవ్వూరు పట్టణంలో ప్రజలకు అందుతున్న ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ నీటి నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; అధికారిక అనుమతులతో వాటర్ ప్లాంట్లు నడుస్తున్నప్పటికీ&comma; వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది&period; నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి తనిఖీలు జరగాల్సి ఉన్నా&comma; అధికారులు ప్రత్యక్షంగా ప్లాంట్లకు వెళ్లకుండా నిర్వాహకులను కార్యాలయాలకు పిలిపించడం విచిత్రంగా మారింది&period; నీటి నాణ్యతపై ప్రశ్నలు ఎదురైనప్పుడు ప్లాంట్ నిర్వాహకులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం పరిస్థితిని మరింత సందేహాస్పదంగా మారుస్తోంది&period; ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల ప్లాంట్ నిర్వాహకుల నుంచే నీటి నమూనాలు తెప్పించి&comma; రూ&period;2500 డీడీల రూపంలో వసూలు చేసి వాటిని లాబ్స్ కు పంపడం మరింత వివాదాస్పదంగా మారింది&period; సాధారణంగా అధికారులు స్వయంగా శాంపిల్స్ సేకరించాల్సి ఉండగా&comma; ఈ విధానం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది&period; గతంలో ఒక ప్లాంట్‌లో నీటి టిన్‌లో పురుగులు కనిపించిన ఘటన ప్రజల్లో భయాందోళనలు రేపింది&period; దీంతో ప్రజలు వాటర్ ప్లాంట్లపై నమ్మకం కోల్పోయి&comma; తిరిగి చేతి పంపులపై ఆధారపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది&period; అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; వెంటనే కఠిన చర్యలు తీసుకుని&comma; నీటి నాణ్యతపై పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు&period;దీనిపై మా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.