కోస్తాంధ్రకు ఐదురోజులపాటు వర్ష సూచన..

కోస్తాంధ్రకు ఐదురోజులపాటు వర్ష సూచన

Advertisements

<p>ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి&period; ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది&period; విజయనగరం జిల్లా&comma; పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం పడింది&period; కొన్ని రోజులుగా ఉక్కపోత&comma; అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన ఊరటనిచ్చింది&period; వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి&period; నగరంలోని పలు చోట్ల వడగళ్ల వర్షం కురిసింది&period; పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు&period; అనంతపురం నగరంలో తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది&period; శ్రీకాకుళం జిల్లా అంతటా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి&period; దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది&period; జిల్లాలో తెల్లవారుజాము నుంచే పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది&period; శ్రీకాకుళం&comma; ఆమదాలవలస&comma; నరసన్నపేట&comma; సారవకోట&comma; మెళియాపుట్టి&comma; కొత్తూరు మండలాల్లో వాన కురిసింది&period; కడప జిల్లా లింగాల మండల పరిధిలోని గుణకనపల్లి&comma; రామట్లపల్లి&comma; చిన్నకుడాల&comma; మురారిచింతలతో పాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రి వీచిన వాన గాలులకు వందల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది&period; దీంతో ఉద్యానవన శాఖ అసిస్టెంట్ యువతేజ నేలమట్టమైన అరటి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.