గోరంట్ల మండలం మలసముద్రం పంచాయితీ కొరేవాండ్లపల్లి, బూదిలివాండ్లపల్లిలో బికె. పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మల సముద్రం గ్రామంలో పర్యటించిన పార్థసారధికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. 2024 ఎన్నికలలో టిడిపి ప్రభంజనం సృష్టిస్తుందని, కచ్చితంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మరొకసారి చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని పార్థసారథి అన్నారు. పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధికారంతోనే రాష్ట్ర భవిష్యత్తు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంధకారమే అంటూ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ, రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని తెలియజేస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించి మరోమారు అధికారంలోకి తీసుకు రావాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్తు బాబుతో నేనని, చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తుఅని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వస్తే రాష్ట్రంలో అంధకారమేనని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలని పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు లాక్కుంటున్నాడని, నిత్యవసర సరుకులు విద్యుత్ చార్జీలు పెంచిడని, మేము అధికారంలోకి వస్తే మద్య పాననిషేధం చేస్తామని మాట ఇచ్చి, మాట తప్పి రకరకాల బ్రాండ్లు పేరుతో జగన్మోహన్ రెడ్డి అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారని
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గజమాలలతో పార్ధుని కీ ఘనస్వాగతం..
56
previous post