తృణమూల్ కాంగ్రెస్ గూండాలను ఏరిపారేస్తాం- ప్రధాని మోదీ

Advertisements

<p>నమస్తే&period;&period;వెల్‌కంటు పంచతంత్రం&period;&period;<br &sol;>&NewLine;దేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయి&period; ముఖ్యంగా బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్&comma; ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది&period; మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ అన్నట్లుగా సాగుతున్న ఈ ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది&period; ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి&period; బెంగాల్ మొదటి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోంది&period; అటు తమిళనాడులోనూ పోలింగ్ శాతంలో పాత రికార్డులు బద్ధలయ్యాయి&period; దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి&period; సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ వార్ జరుగుతోంది&period; మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది&period; ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తామని కుండబద్దలు కొడుతోంది&period; ముఖ్యంగా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని కమలనాథులు చెప్తున్నారు&period; ఆ వివారాలు ఇవాళ్టి పంచతంత్రంలో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p>మే 4à°¨ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు దాక్కోవడానికి బెంగాల్‌లో ఎక్కడా చోటు దొరకదని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ&period; రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ&comma; పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని&comma; ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు&period; ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు&period; ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి&comma; దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటకు తీస్తామని హెచ్చరించారు&period; ఈ రాష్ట్రం విప్లవాల గడ్డ అని గుర్తుంచుకోవాలని అన్నారు&period; ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు&period; మమతా బెనర్జీ సాగిస్తున్న అటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి&comma; దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటకు తీస్తామని మోదీ హెచ్చరించారు&period; మొదటి దశలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు&period; ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు&period; తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు&period; బెంగాల్‌లో మహిళలకు గౌరవం&comma; భద్రత&comma; సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&period; మొదటి దశలో 152 స్థానాలకు పోలింగ్ జరిగిందని&comma; ఇందులో 110కి పైగా స్థానాలను తాము గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందని&comma; ఇది మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వేసిన ఓటు అన్నారు&period; బెంగాల్‌లోనే పుట్టి&comma; బెంగాలీలో చదువుకుని&comma; ఆ భాషను మాట్లాడగలిగేవారే బెంగాల్ తర్వాత ముఖ్యమంత్రిగా అవుతారని అన్నారు&period; కానీ ఆ అవకాశం మమతా బెనర్జీ మేనల్లుడికి రాదని&comma; బీజేపీ కార్యకర్తకు వస్తుందని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సరిహద్దులను పూర్తిగా మూసివేస్తామని&comma; ఒక్క చొరబాటుదారుడు కూడా లోపలికి రాకుండా అడ్డుకుంటామని అమిత్‌à°·à°¾ హామీ ఇచ్చారు&period; ప్రస్తుతం ఉన్న అక్రమ వలసదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు&period; బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>బీజేపీ అధికారంలోకి వస్తే&period;&period; పశ్చిమ బెంగాల్‌లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్‌à°·à°¾ పేర్కొన్నారు&period; చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు&period; మార్పు అంటే&period;&period; చొరబాటు రహిత బెంగాల్‌గా మార్చడమేనన్నారు&period; అవినీతి&comma; బుజ్జగింపులు&comma; దోపిడీల నుంచి స్వేచ్ఛ&comma; యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్నారు&period; ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.