మూడేళ్లుగా ఏం చేస్తున్నారు..? తమిళనాడు గవర్నర్ కు సుప్రీమ్ ప్రశ్న

supreme court

Advertisements

&NewLine;<p>శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు&comma; కేరళ&comma; పంజాబ్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశాయి&period; వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది&period; బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్‌ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది&period; మరోవైపు కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌&comma; ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది&period; బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది&period; కేరళ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ…రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్‌లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు&period; అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు&period; గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్‌ ఆమోదించలేదని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్