శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం మనకు లభించాలంటే ఆయన అనుగ్రహం మనపై వుండాలి. విశ్వశక్తి విరాట్ రూపం ఆవిర్బవించిన పుణ్యస్థలం. నవగ్రహాలను పాలించే శ్రీమన్నారాయణుడు కలియుగంలో శ్రీనివాసునిగా అవతరించిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం తిరుమల. మన గ్రహదోషాలను తొలగించే అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడి ఆనందనిలయం తిరుమల. జాతకంలో గ్రహబాధలున్న భక్తులు వారివారి గ్రహాబాధల నివృత్తికి వివిధ సాధనామార్గాలను అవలంభిస్తారు. అన్నింటికంటే సులభమైన మార్గం మన సమస్యను బట్టి స్వామివారి ఏరోజు దర్శించుకోంటే మేలుకలుగుతుందో పరిహారశాస్త్రంలో వివరించబడింది. మీకు తీవ్ర అనారోగ్య సమస్యలు వుంటే మీరు తప్పకుండా కలియుగ ప్రత్యక్ష్యదైవం శ్రీనివాసుడుని ఆదివారం రోజున దర్శించుకుంటే తప్పక వాటి నుంచి విముక్తి కలుగుతుంది, అలాగే శత్రు నాశనం, రాజానుగ్రహం, అధికార కార్యానుకూలత, కుటుంబ సౌఖ్యం లాంటి ఫలితాలు కలుగుతాయి. రవిగ్రహ దోషాలు పూర్తిగా తొలగి అన్నింటా మీకు విజయం కలుగుతుంది. మీరు సోమవారం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటే మీరు మీ వృత్తి వ్యాపారాల్లో మంచి నేర్పుతో వ్యవహరించే సామర్ధ్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి విభేదాలున్నా తోలగి సుఖజీవనం కలుగుతుంది.
స్వామిని సోమవారం రోజున దర్శించుకోటం వలన ఆనందకర వాతావరణం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పెరగటం లాంటి ఫలితాలు కలుగుతాయి.
అలాగే మీరు స్వామి పుష్కరిణిలో స్నానంచేస్తే చంద్ర గ్రహ దోషాలు పూర్తిగా తొలగుతాయి. మీరు తిరుమలేశుడిని మంగళవారం రోజున దర్శించుకుంటే మీ భవన నిర్మాణ పనులు ఎలాంటి అవరోధాలులేకుండా పూర్తిచేస్తారు, కొత్త ఆస్తిని కొనే అవకాశం, కుటుంబంలో సుఖ, సంతోషాలు లాంటి ఫలితాలు కలుగుతాయి. మీకు కుజగ్రహ, కేతు గ్రహ దోషాలు వుంటే అవి క్రమంగా తగ్గుతాయి, ఆరోగ్యపరంగా మంచి మార్పలు కలుగుతాయి, భయాలు, ఆందోళనలు తొలగుతాయి. ఎలాంటి ఆపదలు కలగవు. మీరు శ్రీనివాసుడుని బుధవారం రోజున దర్శించుకుంటే ఉన్నత విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించే మేలుకుగుతుంది,
విదేశీ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, వివాహంలో ఆటంకాలు తొలగుతాయి. సంపాదన సిద్దిస్తుంది. పదవులు అందుకునే అవకాశం వుంటుంది. స్వామి అనుగ్రహంతో క్లిష్ట సమస్యలు పరిష్కారమవుతాయి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా త్వరగా తొలగి బుధ గ్రహ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీరు గురువారం రోజున శ్రీవేంకటనాధుడిని దర్శించుకుంటే మీకు ఎలాంటి ఆటంకాలు
కలుగవు. మీకు విజ్ఞానం, ఆర్ధిక,వస్తు లాభం, రావల్సిన ధనం లభిస్తాయి. బంగారం పై మక్కువ పెరుగుతుంది. పూర్వికుల ఆస్తి త్వరగా సిద్దించే అవకాశాలు వుంటాయి. గురు గ్రహ దోషాలు తొలగి, మంచి ఉన్నత పదవులు పొందే అవకాశం వుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి, భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది. మీరు లక్ష్మీపతిని శుక్రవారం రోజున దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలిగే అవకాశం మెండుగా వుంటుంది. కొత్త వాహనం కొనే ప్రయత్నాలు సులువుగా ఫలిస్తాయి. స్పెక్యులేషన్ బిజినెస్ లో అధికలాభాలు పొందేఅవకాశం. మీరు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.
భార్యా,భర్తల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో వుంటారు. బంగారు ఆభరణాలు కొంటారు, విదేశాలకు వెల్లటానికి అవకాశాలు వస్తాయి. మీకు శుక్ర గ్రహ దోషాలు వుంటే అవి తప్పక పరిహారమవుతాయి అంటున్నది పరిహారశాస్త్రం. మీరు శ్రీనివాసుడిని శనివారం రోజున దర్శించుకుంటే అప్పుల బాధ తగ్గుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మనోవేదన తొలగుతుంది. మీపై నిందలు వేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు. శత్రువుల బాధలు తగ్గుతాయి. ఇతరుల నుంచి రావల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తులను కాపాడుకొంటారు. కోర్టు విషయాల్లో మీకు
గెలుపు సిద్దిస్తుంది. కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి. మనసు ప్రశాంతంగా వుంటుంది. మీ జీవితంలో చీకట్లు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శని గ్రహ అనుకూలత కలుగుతుంది. రాహు గ్రహ అనుకూలతలు కలుగుతాయి. శనివారం స్వామిని దర్శించుకుంటే సకలశుభాలు కలుగుతాయి. సకల దోషాలు తొలగుతాయి.
ఏరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఏ ఫలితం కలుగుతుంది
77
previous post