63
కాకినాడ జిల్లా.. తునిలో నాటుసారా కేసులో సెబ్ పోలీసులు మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మహిళ పెద్దపాటి రత్నం (45) అస్వస్థకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తుని సెబ్ పోలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. నా తల్లిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆరోగ్యం బాలేదని వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదు, నా తల్లి మరణానికి కారణమైన సీఐ, సిబ్బందిని సస్పెండ్ చెయ్యాలి అంటూ కుమారుడు ఆందోళన చెందాడు.