64
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఒప్పులపాడు గ్రామంలో రస్తాలో ఉన్న కాలువ విషయంపై మహిళలు గొడవ పడడంతో బాల గంగయ్య మరియు గంగిరెడ్డి ఇరువురు రిషిత అనే మహిళపై ఘర్షణకు దిగి కొడవలితో నరకపోవడంతో చేయి అడ్డు పెట్టగా చేయికి బలమైన గాయం తగిలింది వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ రిషిత మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగిరెడ్డి అనే వ్యక్తి నాపై లైంగిక వేధింపులు వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గంగిరెడ్డి గత మూడు నెలల నుంచి రిషిత మహిళపై లైంగిక వేధింపులు చేస్తూ తనకు అనుకూలంగా మలుచుకోలేదని ఇరువురు మహిళలను వాగ్వాదం చేసుకుంటుండగా అతను ఘర్షణలోకి జోక్యం చేసుకొని నాపై కొడవలితో దాడి చేయగా చేయి అడ్డు పెట్టడంతో చేయికి బలమైన గాయం తగిలిందని మహిళ తెలిపింది.
Read Also..