పుంగనూరు సోమల మండలం లో గుర్తుతెలియని మహిళ ది హత్య కాదు ఆత్మహత్య అని తెలిపిన సి.ఐ.రాఘవ రెడ్డి. సోమల మం.లో తిరుపతి రోడ్డు లో గల జగనన్న కాలనీ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలోరోడ్డు ప్రక్కన ఉదయం సగం కాలిన మహిళ మృత దేహం ను కనుగొన్న పాదచారులు. అనంతరం విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరి మృత దేహం అన్న సందేహం తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన సాయి బాబా గుడి సమీపంలో గల విశ్రాంత అధ్యాపకులు చిన్నిన్నిగారి కొటేశ్వరయ్య తన భార్య విజయ లక్ష్మి ఉదయం నుండి కనబడకపోవడంతో ఆయన ,కుమారుడు లిఖిథ్ 14. వారు వచ్చి ఆనవాళ్లు చూసి ఈ మృతదేహం మా అమ్మదే అని గుర్తించారు. అనంతరం పుంగనూరు సి.ఐ.రాఘవ రెడ్డి తన సిబ్బంది చేరుకొని వారిని వివరాలు అడిగితే వారు కొద్దీ రోజుల క్రితం నా భార్య విజయ లక్ష్మి 52 రోడ్డు ప్రమాదంలో కాలు దెబ్బతిందని తెలిపారు. అలాగే ఆమె కి అపోలో వైద్యశాల లో చికిత్స పొందుతున్న విషయం తెలిపారు. ఈ అనారోగ్యంతో వలన కొద్ది రోజులుగా మనోవేదనకు గురైనట్టు తెలిపారు.ఈ కారణం గానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. అనంతరం చిత్తూరు నుండి క్లూస్ టీమ్ రావడం తో టీమ్ సభ్యులు మృత దేహాన్ని పరిశీలించారు.ఆమె నిన్న సోమల పెట్రోల్ పంపు లో పెట్రోల్ 4 లీటర్ల ను అలాగే లైటర్ ను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. ఆలాగే లైటర్ ఏవిధంగా పనిచేస్తుందని తన కుమారుడు లిఖిథ్ తొ గత రెండు రోజుల క్రితం చర్చించినట్లు తెలిపారని సి.ఐ.రాఘవరెడ్డి తెలిపారు. ఈ కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుమృత దేహాన్ని పుంగనూరు ప్రభుత్వ వైద్యశాల కు తరలించినట్లు తెలిపారు.
మహిళ ది హత్య కాదు ఆత్మహత్య…
79