అంబులెన్స్ లో వచ్చి నామినేషన్..

ambulance

Advertisements

&NewLine;<p>దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు&period; ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైన సంగతి తెలిసిందే&period; ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు&period; ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన దుబ్బాకకు వచ్చారు&period; ఆయన సహాయకులు వీల్ ఛైర్ లో ఆయనను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లారు&period; అంతకు ముందు దుబ్బాకలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు&period; అక్టోబర్ 30న దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై గటాని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఆయన పొత్తికడుపులో పొడిచాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ నుంచి ఇంటెన్స్ పోస్టర్.. సెప్టెంబర్ 10న భారీ ఎత్తున చిత్రం విడుదల.

షరతులతో బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.

మల్లేపల్లి రూపా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ.